రష్మిక మందన కన్నడంలో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది.టాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది. అక్కడ ఇంకా ఈమెకు ఆశించిన స్థాయిలో క్రేజ్ ఏర్పడలేదు.అయితే ‘పుష్ప’ చిత్రంతో బాలీవుడ్ జనాలకు అప్పుడే దగ్గరైపోయింది. ఆ చిత్రంతో ఈమెను నేషనల్ క్రష్ గా డిక్లేర్ చేసేశారు అక్కడి జనాలు. దీంతో బాలీవుడ్లో ఆమె చేస్తున్న స్ట్రైట్ సినిమాలు విడుదల కాకముందే రష్మిక కు బోలెడంత క్రేజ్ ఏర్పడింది.
ఇదిలా ఉండగా రష్మిక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో ఒప్పుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. కొన్ని మేకింగ్ దశలో ఉన్నాయి. కానీ ఊహించని విధంగా ఓ సినిమా ఆగిపోయినట్టు వినికిడి. వివరాల్లోకి వెళితే.. టైగర్ ష్రాఫ్ సరసన ఈమె ఓ మూవీ చేయడానికి సైన్ చేసింది. కానీ ఈ సినిమా మొదలు కాకముందే ఆగిపోయినట్టు సమాచారం.‘స్క్రూడీలా’ అనే టైటిల్ తో శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది.
టైగర్, రష్మిక కాంబినేషన్లో ఈ మూవీ రూపొందనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ నిర్మాత కరణ్ జోహార్ ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్ పెట్టాల్సి రావడం… అనుకున్న దానికంటే మేకింగ్ కు ఎక్కువ టైం పడుతుంది వంటి లెక్కలు వేసుకుని ఆయన ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం కోసం టైగర్ ష్రాఫ్ రూ.35 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. ఇక రష్మిక కోసం రూ.4 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది.
ఇలా మొత్తంగా రూ.140 కోట్ల భారీ బడ్జెట్ ఈ చిత్రం కోసం కేటాయించాల్సి వస్తుందట. ‘లైగర్’ చిత్రం భారీ నష్టాలను మిగల్చడంతో కరణ్.. ‘స్క్రూడీలా’ ను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ‘లైగర్’ హిందీ వెర్షన్ సేఫ్ అయ్యింది. కానీ మిగిలిన భాషల్లో ఆ మూవీ భారీ నష్టాలు మిగిల్చింది అని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇక నుండి మిడ్ రేంజ్ ప్రాజెక్టులు మాత్రమే చేయాలని కరణ్ ఫిక్స్ అయినట్లు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.