మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావణాసుర’. ‘అభిషేక్ పిక్చర్స్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ బ్యానర్లపై అభిషేక్ నామా, రవితేజ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా.. వంటి క్రేజీ హీరోయిన్లు ఈ చిత్రంలో నటించారు. జయరాం, రావు రమేష్, భరత్ రెడ్డి, శ్రీరామ్, సంపత్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు.
టీజర్, ట్రైలర్ లు సో సోగా ఉన్నాయి. దీంతో సినిమాపై బజ్ అంతగా ఏర్పడలేదు. సినిమాని కూడా నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
6.80 cr
సీడెడ్
2.60 cr
ఉత్తరాంధ్ర
2.20 cr
ఈస్ట్
1.10 cr
వెస్ట్
1.00 cr
గుంటూరు
1.20 cr
కృష్ణా
1.30 cr
నెల్లూరు
0.50 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
16.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.20 cr
ఓవర్సీస్
1.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
18.90 cr (షేర్
‘రావణాసుర’ (Ravanasura) చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.19 కోట్లుగా ఉంది. టాక్ పాజిటివ్ గా వస్తే ‘రావణాసుర’ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు ఉండవచ్చు. లేదంటే పోటీగా ‘దసరా’ సినిమా ఉంది కాబట్టి .. ఓపెనింగ్స్ పై దెబ్బ పడే ప్రమాదం కూడా లేకపోలేదు.
అలాగే ఇంకో వైపు ‘మీటర్’ అనే సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. కిరణ్ అబ్బవరం సినిమా కాబట్టి… వీకెండ్ వరకు ఆ సినిమాకు కూడా జనాలు థియేటర్లకు వెళ్లే అవకాశం ఉంది. మరి ఫైనల్ గా ‘రావణాసుర’ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.