Bigg Boss 5 Telugu: సీక్రెట్ టాస్క్ లో రెచ్చిపోయిన రవి ఏం చేశాడో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో బిబి హోటల్ టాస్క్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇది నిజానికి కొత్త టాస్కేం కాదు. సీజన్ 1 నుంచీ మనం చూస్తున్న టాస్కే. అయితే, ఎప్పటికప్పుడు బిబి హోటల్ ని సరికొత్తగా ముస్తాబు చేసేందుకు బిగ్ బాస్ టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇంటి కుటుంబసభ్యులు ఒక్కొక్కరు ఒక్కో అవతారం ఎత్తారు. మేనేజర్ గా , రిసెప్షనిస్ట్ గా అనీమాస్టర్, వెయిటర్స్ అండ్ చెఫ్స్ గా షణ్ముక్, శ్రీరామ్ చంద్ర, ఉద్యోగాన్ని కాపాడుకుని హౌస్ కీపింగ్ స్టాఫ్ గా రవి,

మానస్ అండ్ ప్రియాంక హనీమూన్ కపుల్ గా, లాట్రీ ద్వారా పైవ్ స్టార్ హోటల్ స్టే పొందిన వ్యక్తిగా సన్నీ, గారాబంగా పెరిగిన డాన్ కూతురుగా సిరి, హౌటల్ ఓనర్ ఫ్రెండ్ గా కాజల్ ఇలా క్యారెక్టర్స్ లో సెటిల్ అయ్యారు హౌస్ మేట్స్. ఇక పెర్ఫామెన్స్ పీక్స్ లోకి వెళ్లింది. ఇందులో భాగంగానే రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌లో ఉంటూనే అతిథులకిచ్చే సర్వీసులను చెడగట్టాలని, వారి సర్వీస్ మాత్రమే బాగుందనిపించాలని రవికి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు.

సీక్రెట్ టాస్క్ లో భాగంగా రవి రెచ్చిపోయాడు. హౌస్ కీపింగా స్టాఫ్ గా నటిస్తూనే వచ్చే సర్వీస్ లని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడే టిప్స్ కోసం చూస్తున్న వెయిటర్స్ కి టిప్స్ అందకుండా చేశాడు. ఇక్కడే కాజల్ తన బ్యాగ్ మర్చిపోయి బయటకి వెళ్లినపుడు బ్యాగ్ లో ఉన్న డబ్బులని కొట్టేసి కాజల్ కి షాక్ ఇచ్చాడు. డబ్బులు పోవడంతో కాజల్ గోల గోల చేసింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus