మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదల కానుంది. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ కొన్ని కామన్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగా హీరో సిద్దు జొన్నలగడ్డతో కలిసి ఓ ఫన్నీ చిట్ చాట్లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా.. సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’ సినిమా టాపిక్ తీసుకొచ్చాడు రవితేజ. అది పెద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.
దాని నుండి ‘నువ్వు ఏం నేర్చుకున్నావ్’ అనే సెన్స్ లో సిద్ధూని అడిగాడు రవితేజ. ‘అది ఐడియా పరంగా బాగుందని.. కానీ చివర్లో మేము అనుకున్నట్టు రాలేదని’ సిద్ధూ చెప్పాడు. ఆ తర్వాత రవితేజ.. ‘కొన్ని సినిమాలు ఐడియాల పరంగా బాగుంటాయి. కానీ చివరికి తేడా కొట్టేస్తాయి. కొన్ని మన తప్పులు ఉండొచ్చు. మరికొన్ని వాళ్ళ తప్పులు ఉండొచ్చు. అందుకే నా సినిమాలు ప్లాప్ అయితే నేనే రెస్పాన్సిబుల్.. అదే హిట్ అయితే అందరి క్రెడిట్ ఉంటుంది’ అంటూ రవితేజ చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. బాగానే ఉంది.
వాస్తవానికి ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు తరచూ చెప్పే మాటే. ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ వంటి సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు మహేష్ బాబు ఎక్కువగా ఇదే స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఓ ప్లాప్ సినిమాకి హీరో బాధ్యత వహించడం అనేది గొప్ప విషయమే. ఇప్పుడు రవితేజ కూడా అదే మాట చెప్పడం.. సంతోషించదగ్గ విషయమే.
కానీ గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్ 2’ అనే సినిమా చేశాడు రవితేజ. అది ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి సురేందర్ రెడ్డి కారణమని.. ‘బడ్జెట్ పెరిగిపోతుంది అని మొదటి నుండి నేను చెప్పినప్పటికీ.. సురేందర్ రెడ్డి పట్టించుకోలేదు’ అన్నట్టు రవితేజ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఆడకపోవడానికి పూర్తిగా దర్శకుడే కారణమన్నట్టు రవితేజ తోసిపుచ్చాడు. అలాంటి రవితేజ ఇప్పుడు ‘ప్లాప్ కి నేనే బాధ్యుడిని’ అని చెప్పడం గొప్ప మార్పే.