మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) మరికొన్ని రోజుల్లో మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజవుతోంది. ఈ నెల 14వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. మరోవైపు ఈ మధ్య కాలంలో రీరిలీజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. పెద్ద సినిమాల రీరిలీజ్ ట్రెండ్ గురించి రవితేజ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
Ravi Teja
మురారి (Murari) సినిమా తాజాగా రీరిలీజ్ కాగా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ నటించిన వెంకీ (Venky) సినిమాకు సైతం రీరిలీజ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ మాట్లాడుతూ రీరిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర మాత్రమే ఉందని కామెంట్లు చేశారు. నిజంగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను దేవుళ్లు అని అనవచ్చని వాళ్లు సినిమాను ఎంతలా ప్రేమిస్తారో రీరిలీజ్ కలెక్షన్లను చూస్తే అర్థమవుతుందని రవితేజ పేర్కొన్నారు.
పాత సినిమాను ఉదయం ఆరున్నర గంటలకే థియేటర్లలో చూడటం ఆశ్చర్యంగా అనిపిస్తుందని రవితేజ పేర్కొన్నారు. అప్పట్లో చిరంజీవి (Chiranjeevi) , బాలయ్య (Balakrishna) సినిమాలు విడుదలైతే ఉదయం 7 గంటలకే వెళ్లి చూసేవాళ్లం అని రవితేజ చెప్పుకొచ్చారు. ఈతరం ప్రేక్షకులు ఉదయం 5 గంటలకే వెళ్లి సినిమాలు చూస్తున్నారని నిజంగా వాళ్లు చాలా గ్రేట్ అని రవితేజ అన్నారు. ఇలాంటి పిచ్చి మనవాళ్లకు తప్ప ఎక్కడా లేదు అని మాస్ మహారాజ్ పేర్కొన్నారు.
అమితాబ్ (Amitabh Bachchan) షోలే రీరిలీజ్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మాస్ మహారాజ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. రవితేజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మిస్టర్ బచ్చన్ సినిమా రైడ్ రీమేక్ అయినా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.