గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన “బలుపు” చిత్రానికి రచయితగా పని చేసాడు కె.ఎస్.రవీందర్ అలియాస్ బాబి. ఆ సమయంలో బాబి ప్రతిభను పసిగట్టిన రవితేజ అతనికి దర్సకత్వం ఛాన్స్ ఇచ్చాడు. బాబిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రవితేజ హీరోగా రూపొందిన చిత్రమే “పవర్”.
ఈ చిత్రం ఘన విజయం సాధించకపోయినా బాక్సాఫీస్ దగ్గర ఫరవాలేధనిపించుకొంది. మరి ఆ చిత్రంలో బాబి ప్రతిభ నచ్చిందో లెక.. “పవర్” అనే టైటిల్ నచ్చిందో కానీ.. సంపత నంది స్థానంలో “సర్దార్ గబ్బర్ సింగ్” చిత్రానికి దర్శకుడిగా బాబిని తీసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఈ సినిమా విడుదలకు ముందు.. బాబి దర్సకత్వంలో రామ్ చరణ్ హీరోగా తన సొంత బ్యానర్ పై పవన్ కళ్యాణ్ ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారనే ఊహాగానాలు షికారు చేసాయి. కానీ.. “సర్దార్ గబ్బర్ సింగ్” రిజల్ట్ మరీ ఘోరగా ఉండడంతో రామ్ చరణ్ తో బాబి సినిమా ఉండకపోచ్చని వినిపిస్తోంది.
ఈ నేపధ్యంలో.. “పవర్” చిత్రంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రవితేజ మరోసారి బాబికి అవకాశం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని, వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలోనే సినిమా అనౌన్స్ కానున్నధన్నది తాజా సమాచారం!!