Ravi Teja: మాస్ కాంబో నుండి ఇలాంటి సినిమానా.. పెద్ద షాకే..!

రవితేజ వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. ‘రావణాసుర’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ వంటి ప్లాపులు రవితేజ మార్కెట్ డౌన్ అయ్యేలా చేశాయి. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 27న ఈ సినిమా విడుదల కానుంది.

Ravi Teja

ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు రవితేజ. దర్శకుడు భాను భోగ వరపు ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీతో నింపేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. దీని తర్వాత రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు.దీని షూటింగ్ కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. దీని తర్వాత ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని కూడా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీనే నిర్మిస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇది సోసియో ఫాంటసీ జోనర్లో రూపొందే సినిమా అని వినికిడి. కళ్యాణ్ శంకర్ చేసిన 2 సినిమాలు కామెడీ జోనర్లో రూపొందినవే.

రవితేజ కూడా సోసియో ఫాంటసీ జోనర్లో ఎక్కువ సినిమాలు చేయలేదు. ‘దరువు’ చేసినా అది ఆడలేదు. ఇక నిర్మాత నాగవంశీకి కూడా ఇది కొత్త జోనర్ అనే చెప్పాలి. అందుకే ఇది ముగ్గురు కెరీర్ కు ప్రత్యేకం కానుంది. ఇది రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుందని కూడా టాక్ వినిపిస్తుంది.

బెట్టింగ్ యాప్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన ఈడీ..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus