ఎవరి ఫేట్ ఎలా ఉండబోతుందో ఎవ్వరూ చెప్పలేరు.. కోటీశ్వరులు కూడా మిడిల్ క్లాస్ రేంజ్ వచ్చేయొచ్చు… కూలి పని చేసుకునే వాళ్ళు కూడా భవిష్యత్తులో కోట్లు సంపాదించొచ్చు. కాబట్టి ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు.. తక్కువ చేసి చూడకూడదు. ఈ విషయాన్ని మనకు ఎంతో మంది గొప్పవాళ్ళు చెప్పి ఉండొచ్చు. కానీ మనకి సినిమాలంటే ఇష్టం కాబట్టి.. కొంతమంది హీరోల ‘పాయింట్ ఆఫ్ వ్యూ’ లో చెప్పుకోవచ్చు. వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, నేచురల్ స్టార్ నాని లను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. జనవరి 26న రవితేజ పుట్టినరోజు కాబట్టి ఆయన గురించి తెలుసుకుందాం రండి.
23 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ.. మొదట లైట్ బాయ్ గా పనిచేసేవాడు. తినడానికి సరిగ్గా డబ్బులు కూడా లేకుండా కష్టపడిన రవితేజ.. దేనిని లెక్కచేయకుండా ముందుకు సాగేవాడట. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఈ క్రమంలో దర్శకుడు కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లతో రవితేజకు స్నేహం ఏర్పడింది. ముందుగా కృష్ణవంశీ సలహా మేరకు కొన్ని సినిమాల్లో హీరోగా చేసాడు. అందులో ‘సింధూరం’ సినిమాలో రవితేజ చేసిన ‘చంటి’ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలా మెల్లగా కెరీర్ కొనసాగిస్తున్న రవితేజకు ‘నీకోసం’ ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ వంటి చిత్రాలు హీరోగా మంచి గుర్తింపును అందించాయి. ఇక అటు తరువాత చేసిన ‘ఇడియట్’ చిత్రం రవితేజ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ చిత్రంలో కూడా ‘చంటి’ అనే పాత్రే చేసాడు రవితేజ.. ముందుగా ‘సింధూరంలో’ కూడా అదే పేరుతో ఉన్న పాత్ర చేసాడు కాబట్టి ఈసారి చాలా ఈజీ అయిపొయింది. ఇక అప్పటి నుండీ ఇప్పటి వరకూ వెనక్కి తిరిగి చూసుకోలేదు రవితేజ. తన మాస్ బాడీ లాంగ్వేజ్ తో 50 ఏళ్ళకు వయసు పైన పడినా అదే ఎనర్జీతో దూసుకుపోతున్నాడు. అలాంటి రవితేజ కు సంబందించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి.