ఎంతటి స్టార్ ఫాలోయింగ్ కలిగిన హీరోలకైనా ఒక్కోసారి బ్యాడ్ ఫేస్ నడుస్తుంటుంది. ఆ టైములో వాళ్ళు ఎన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటించినా సక్సెస్ అందుకోలేరు. ఆ హీరోలు ప్లాపుల నుండీ బయటపడటానికి ఏళ్ళకి ఏళ్ళు టైం పట్టొచ్చు.ఇందుకు ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి.’ఖుషి’ తరువాత చూసుకుంటే పవన్ కళ్యాణ్ కు 10 ఏళ్ళ వరకూ ప్లాప్ లు వెంటాడాయి.’జల్సా’ హిట్ అయినా అది పవన్ కళ్యాణ్ క్రేజ్ కు తగ్గ హిట్టు కాదు అని అభిమానులే చెబుతుంటారు.
ఇక మహేష్ బాబుకి ‘పోకిరి’ తరువాత 5 ఏళ్ళ వరకూ ప్లాప్ లు వెంటాడాయి.’దూకుడు’ తో అతను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.ప్రస్తుతం కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన హీరోలు చాలా మందే ఉన్నారు.శర్వానంద్, నాని ఇలా చాలా మంది ఉన్నారు.ఈ లిస్ట్ లో ఈ ఏడాది ముందు వరకు బాలకృష్ణ, రవితేజ లు కూడా ఉండేవారు. ‘రాజా ది గ్రేట్’ తరువాత ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ వంటి ప్లాప్ లని మూటకట్టుకున్న రవితేజ చివరికి..
తనకి రెండు హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేనిని నమ్ముకున్నాడు. అతని డైరెక్షన్లో చేసిన ‘క్రాక్’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అంటే జనవరి 9న విడుదలై రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రవితేజ బాటలోనే బాలయ్య కూడా ఉన్నాడు. ‘జై సింహా’ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి చిత్రాల్లో నటించాడు బాలయ్య. ఆ సినిమాలన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి.
ఇక బాలయ్య పనైపోయింది అనుకున్న టైములో తనకి ‘సింహా’ ‘లెజెండ్’ వంటి రెండు హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను నే నమ్ముకున్నాడు. అలా చేసిన ‘అఖండ’ డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇలా ఏడాది ఆరంభంలో రవితేజ… ఏడాది చివర్లో బాలయ్య హ్యాట్రిక్ కాంబోలతో ప్లాప్ ల నుండీ బయటపడ్డారు.