టాలీవుడ్ స్టార్ రవితేజ (Ravi Teja) కూతురు మోక్షధ, సినీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి అనుకోని మార్గాన్ని ఎంచుకుంది. నటన వైపు కాకుండా, తెర వెనుక ప్రపంచాన్ని అర్థం చేసుకుని, డైరెక్షన్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌లో సహాయ దర్శకురాలిగా పనిచేస్తోంది. చిన్న వయసులోనే ఈ స్థాయి ఆసక్తి చూపడంపై పరిశ్రమలోని వారంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా తీయడంలో ప్రతి క్రాఫ్ట్‌పై అవగాహన పెంచుకోవడం, దర్శకురాలిగా ఎదగడానికి కావలసిన అనుభవం సంపాదించడం కోసం ఆమె నేరుగా సెట్స్ వద్ద పని చేస్తోంది.
Ravi Teja
ఇది నేటి తరం వారసుల్లో అరుదైన దృష్టికోణం. టాలీవుడ్‌లో ఎక్కువగా నటన వైపే మొగ్గుచూపుతున్న స్టార్ పిల్లల మధ్య, మోక్షధ చూపుతున్న ఈ వైవిధ్యం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక ఆమె సోదరుడు మహాధన్ కూడా ఈ మార్గంలోనే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాజా ది గ్రేట్‌లో (Raja the Great) చిన్న వయసులోనే నటనలో ఆకట్టుకున్న మహాధన్, ఇప్పుడు డైరెక్షన్ శిక్షణ తీసుకుంటూ తన స్కిల్స్ కు పదును పెడుతున్నాడు.
కుటుంబ సభ్యులుగా వీరిద్దరూ సినిమా నిర్మాణం మరియు దాని వెనుక ఉన్న శ్రమను అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇది పరిశ్రమలో తమ స్థాయిని రుజువు చేసుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది. రవితేజ సినీ ప్రస్థానమే తన పిల్లలకు పెద్ద ప్రేరణగా మారింది. ఒకప్పుడు డైరెక్షన్ విభాగంలో పని చేసి, నటుడిగా మారి, స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ, తన పిల్లలు కూడా క్రాఫ్ట్‌పై పూర్తి పట్టుదలతో పనిచేయాలని ప్రోత్సహిస్తున్నారు.
టాలీవుడ్‌లో ఈ తరహా వారసులు తమ దారిని ఇలాంటి శ్రమతోనే కట్టిపడేయడం అరుదు. మోక్షధ ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పనిచేస్తుండడం, పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ఓ పెద్ద అనుభవంగా మారబోతోంది. మరి ఆమె మొదటి అడుగు అడుగు ఎలా ఉంటుందో కాలమే సమాధానం ఇవ్వాలి.