రవితేజ (Ravi Teja) హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) మూవీ గత నెల 15వ తేదీన థియేటర్లలో విడుదలై ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ లో చేసిన తప్పుల వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Mr Bachchan
తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోని మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) ఓటీటీలో మాత్రం కచ్చితంగా హిట్టవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ అభిమానులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాలో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటించడం జరిగింది.
ఈ సినిమాలో పాటలు హిట్ కాగా కథ, కథనం రొటీన్ గా ఉండటం ఈ సినిమాకు మైనస్ అయింది. హరీష్ శంకర్ ఈ సినిమా కోసం బాగానే కష్టపడినా ఈ సినిమాతో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశ పరిచారు. రవితేజ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అటు రవితేజ ఇటు హరీష్ శంకర్ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో తమ రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని వెనక్కు ఇచ్చేశారు.
మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) మూవీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా ఫ్లాపైనా భాగ్యశ్రీ బోర్సేకు మాత్రం ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నాయని తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. రవితేజ తర్వాత సినిమాలు కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.