మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja)వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ‘ధమాకా’ (Dhamaka) తర్వాత అతను హీరోగా చేసిన ‘రావణాసుర’ (Ravanasura) ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ‘ఈగల్’ (Eagle) ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)..ఇలా ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అయ్యాయి. ఈ 4 సినిమాలు రూ.60 కోట్ల పైనే నష్టాలు మిగిల్చినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రవితేజ మాత్రం అసలు ఈ డిజాస్టర్లతో సంబంధం లేదన్నట్టు వరుస సినిమాలను ఓకే చేస్తూ పోతున్నాడు. అసలు ఈ ప్లాపులతో తనకు సంబంధం లేదు అన్నట్టే అతని తీరు ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Ravi Teja
ఇదిలా ఉండగా.. రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు అనే నూతన దర్శకుడితో తన 75వ (RT75) సినిమా చేస్తున్నాడు. శ్రీలీల (Sreeleela) ఇందులో హీరోయిన్ కాగా.. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఇది. రవితేజ ఇమేజ్ కి కరెక్ట్ గా సరిపోతుంది అని తెలుస్తుంది. అందుకే 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుందని తెలుస్తుంది.
ఎందుకంటే సంక్రాంతికి వెంకటేష్ (Venkatesh) , చిరంజీవి (Chiranjeevi) .. వంటి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి. వీటిని దిల్ రాజే (Dil Raju) నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. రవితేజ 75వ సినిమా నైజాం హక్కులు కూడా ఆయనే తీసుకున్నట్లు వినికిడి. మరోపక్క నాగవంశీ నిర్మాణంలో, బాబీ (K. S. Ravindra) దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా కూడా అదే టైంకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. కాబట్టి.. తన సినిమాపై తన సినిమానే పోటీకి దింపలేడు కాబట్టి.. నాగవంశీ వెనక్కి తగ్గినట్టు టాక్.