టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) , ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా RC16 (RC 16 Movie) పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘గేమ్ చేంజర్’ (Game Changer) తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు (R. Rathnavelu) “క్రికెట్ పవర్” అంటూ ఇచ్చిన హింట్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగనుందనే ఊహలను మరింత బలపరిచింది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసిన మూవీ టీం, హై స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ పై ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ 2025 అక్టోబర్ 16 సినిమాను వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీపావళి పండుగ (అక్టోబర్ 20) ముందు రిలీజ్ చేస్తే, వారాంతం కూడా కలిసొచ్చే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోందట. అసలు ఈ మూవీని దసరా కానుకగా రిలీజ్ చేయాలని మొదట భావించినా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వేగం, ఇతర ప్యాన్ ఇండియా సినిమాల షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకుని, దీపావళి సీజన్‌ను టార్గెట్ చేయాలని నిర్ణయించినట్లు టాక్.
సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, ఈ హాలిడే సీజన్ బాక్సాఫీస్ వద్ద RC16 బ్లాక్‌బస్టర్ కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా విషయానికొస్తే, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), జగపతిబాబు (Jagapathi Babu) వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ (A.R.Rahman) ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. మొత్తానికి, అక్టోబర్ 16న RC16 గ్రాండ్ రిలీజ్ కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇస్తారని, అదే సమయంలో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేస్తారని సమాచారం.