బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అనగానే అభిమానులు ఎగిరి గంతేస్తారు. ఈ సారి యాక్షన్ పీక్స్ లో ఉంటాయని సంబరపడ్డారు. కానీ ఇప్పుడు బోయపాటి మీద ఆగ్రహంతో ఉన్నారు. కారణం షూటింగ్ మొదలై మూడు నెలలు అవుతున్నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకపోవడం. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ ని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 న రిలీజ్ చేస్తారని, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశపడ్డారు. కానీ టైటిల్ కూడా రివీల్ కాలేదు. వినాయకచవితి.. దసరాకైనా రిలీజ్ చేస్తారని ఎదురుచూసారు. నిరాశే మిగిలింది. దీంతో సోషల్ మీడియాలో డైరక్టర్, నిర్మాతలను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆలస్యానికి ఓ బలమైన కారణం ఉందని తెలిసింది.
ఈ సినిమాకి “వినయ విధేయ రామ” అనే టైటిల్ ని రీసెంట్ గానే ఫైనల్ చేశారు. ఇక లోగో డిఫెరెంట్ గా ఉండాలని చూస్తున్నారు. ఆ డిజైన్స్ నచ్చకపోవడంతో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయకుండా ఆపుతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ని అదిరిపోయే స్టిల్స్ ఉన్నాయి కానీ అందుకు మ్యాచ్ అయ్యే లోగో సెట్ కాకపోవడంతో రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. బోయపాటిని సంతృప్తిపరిచే లోగో ఫైనల్ అయిందంటే వెంటనే ఫస్ట్ లుక్ వచేస్తుందంట. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఐరోపాలోని “అజర్ బైజాన్” అనే ప్రాంతంలో 25 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు వైజాక్ లో చిత్రీకరణ సాగుతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.