ఎంత కష్ట పడ్డా కొన్నిసార్లు విజయం దోబూచులాడుతుంది. సహనాన్ని పరీక్షిస్తుంది. అటువంటప్పుడు కోపంతో పరిగెత్తకుండా.. కాసేపు ఆగి ఆలోచించాలి. మన ప్రయత్నంలో ఏమైనా లోపం ఉందో చెక్ చేసుకోవాలి. అందుకు తగ్గట్టు మార్పులు చేసుకోవాలి. ఆ పనిలోనే ఉన్నారు నేటి కొంతమంది తెలుగు యువ హీరోలు. వారే మంచు మనోజ్, విష్ణు, సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్. మోహన్ బాబు పెద్ద తనయుడు విష్ణు పదేళ్ల క్రితం ఢీ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని డీ కొట్టారు. ఆ తర్వాత మంచి హిట్ కొట్టలేకపోయారు. రీసెంట్ గా వచ్చిన ఆచారి యాత్ర కూడా కలక్షన్ల యాత్ర చేయలేక వెనుతిరిగింది. అతని తమ్ముని పరిస్థితి అంతే. ఒక్కడు మిగిలాడు కోసం మనోజ్ ఒక్కడే చాలా శ్రమించాడు. కానీ థియేటర్లని ప్రేక్షకులతో నింపలేకపోయాయడు. అందుకే వీరిద్దరూ ఏ కథకి ఒకే చెప్పకుండా ఆలోచనలో పడ్డారు.
ఇక మెగా ఫ్యామిలీ కి చెందిన సాయిధరమ్ తేజ్ వరుసగా ఆరు ఫ్లాపులు చూసాడు. మొదట్లో హ్యాట్రిక్ హిట్ అందుకున్నా ఆ తర్వాత ఒక్క హిట్ అందుకోలేకపోయారు. దీంతో తన రూపు మార్చుకునేందుకు అమెరికాకి చెక్కేసాడు. రూపు మాత్రమే కాదు, మనసు కుదుటపడింది తర్వాత కిషోర్ తిరుమల సినిమా స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నారు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకపోయినప్పటికీ రాజ్ తరుణ్ బాగానే దూసుకువచ్చాడు. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. రీసెంట్ గా వచ్చిన లవర్ చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ హీరో కూడా గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తిరుపతి వెళ్లి గుండు కూడా కొట్టించుకున్నాడు. సో.. మళ్లీ కొత్తగా జుట్టు వచ్చేవరకు రాజ్ తరుణ్ సినిమాలు చేయడని స్పష్టమయింది. వీరి సినిమాలు పట్టాలెక్కి.. థియేటర్లోకి రావాలంటే తప్పకుండా ఏడాది పడుతుంది.