యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డ్ రాగా తారక్ కు అవార్డ్ రావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది. తారక్ దుబాయ్ కు వెళ్లడానికి కారణమేంటనే ప్రశ్నకు సైతం ఫ్యాన్స్ కు సమాధానం దొరికేసింది. అయితే చంద్రబాబు అరెస్ట్ గురించి తారక్ స్పందించకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తల వల్ల తారక్ డిస్టర్బ్ అయ్యారని సమాచారం అందుతోంది.
ఈ కథనాలు తారక్ ను ఎంతగానో బాధ పెడుతున్నాయని తెలుస్తోంది. సరైన సమయం వస్తే తారక్ తన విషయంలో నెలకొన్న అన్ని వివాదాల గురించి స్పందించి క్లారిటీ ఇవ్వాలని ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది. తారక్ ప్రస్తుతం దేవ ర సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) 2024 సంవత్సరం సమ్మర్ లో దేవరతో బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సలార్ మూవీ విడుదలైన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తారక్ తర్వాత సినిమాలు తెరకెక్కుతున్నాయి.
టైగర్3 సినిమాలో తారక్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూనే బాలీవుడ్ లో కూడా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.