పుష్ప ది రూల్ (Pushpa2) సినిమాతో కనీసం 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడం బన్నీ (Allu Arjun) టార్గెట్ అనే సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ మూవీ సక్సెస్ సాధించడం కోసం బన్నీ, సుకుమార్ (Sukumar) రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రతి సీన్ ప్రత్యేకంగా ఉండేలా బన్నీ, సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పుష్ప ది రూల్ హిందీ హక్కులు 200 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అడ్వాన్స్ బేసిస్ మీద ఇంత మొత్తం ఇచ్చారని భోగట్టా.
ఈ రేంజ్ లో హిందీలో బిజినెస్ చేసిన తొలి సినిమాగా పుష్ప ది రూల్ నిలిచిందని సమాచారం అందుతోంది. బన్నీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కు నిదర్శనం ఇదేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 500 నుంచి 600 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లేనని సమాచారం అందుతోంది. పుష్పరాజ్ పాత్ర విషయంలో మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకున్నారని భోగట్టా.
పుష్ప ది రూల్ సినిమాకు పోటీగా మరే సినిమా రిలీజ్ కావట్లేదు కాబట్టి కనీసం మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు తిరుగుండదని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా పుష్ప ది రూల్ హక్కులను మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం ఆఫర్ చేయడంతో మైత్రీ నిర్మాతలు ఈ దిశగా అడుగులు వేసినట్టు భోగట్టా.
పుష్ప ది రూల్ మూవీ నిజంగానే ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. రష్మిక (Rashmika Mandanna) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేపథ్యంలో ఆమెకు ఈ సినిమా ఏ స్థాయిలో ప్లస్ అవుతుందో చూడాలి. పుష్ప ది రూల్ లో కొన్ని కొత్త పాత్రల ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బన్నీ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ సినిమాగా నిలిచిపోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.