వెండి తెరపై వెలిగిపోవాలని కలలు కనే హీరోయిన్స్ ఎక్కువమంది బాలీవుడ్ లో సినిమాలు చేయాలనీ ఆశపడుతుంటారు. అక్కడ ఎక్కువ సినిమాలు చేయాలనీ తపిస్తుంటారు. అందుకే దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ.. బాలీవుడ్ నుంచి పిలుపురాగానే.. ఇక్కడ వారిని వదిలేసి అక్కడ వాలిపోతారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్, రెజీనాలు కూడా బాలీవుడ్ ఛాన్స్ రాగానే.. ఎగురుకుంటూ వెళ్లారు. ధృవ, నాన్నకు ప్రేమతో, సరైనోడు వంటి సినిమాల్తో వరుసగా విజయాలు అందుకున్న రకుల్ బాలీవుడ్ లో అయ్యారే సినిమా చేసింది. దీంతో తాను బాగా పాపులర్ అయిపోతుందని అనుకుంది. కానీ ఆశించినంత విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు అజయ్ దేవగన్ తో మరో మూవీ చేస్తోంది. ఇది కూడా రకుల్ కి పేరు తెచ్చేలా లేదు.
అందుకే టాలీవుడ్ కథలను వినడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇక నుంచి బాలీవుడ్ సినిమాల కోసం దక్షిణాది చిత్రాలను వదులుకోకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. రేజీనాకి కూడా తెలుగు, తమిళంలో బాగానే అవకాశాలున్నాయి. అయినా బాలీవుడ్ చుట్టూ ప్రదిక్షణలు చేసి “ఏక్ లడ్కి కో దేఖా తొ ఐసా లగా” సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ చిత్రం వల్ల డేట్స్ ఎక్కువగా పోతున్నాయని.. సినిమా మాత్రం పూర్తి కావడం లేదని.. ఏడాది మొత్త వృధా అవుతుందని రెజీనా బాధపడుతోంది. దీంతో హిందీ పరిశ్రమకి దండం పెట్టి దక్షిణాది సినిమాలకే పరిమితం కావాలని డిసైడ్ అయింది.