బుల్లితెర పై ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షోని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క షో జనాల్ని ఎంతగా నవ్విస్తుందో, ఎంత ప్రభావితం చేస్తుందో కూడా అందరికీ తెలిసిందే. ‘జబర్దస్త్’ షో వచ్చాక కామెడీ సినిమాలకి జనాలు వెళ్ళడం మానేశారు. శ్రీనువైట్ల వంటి కామెడీని నమ్ముకున్న డైరెక్టర్లు షెడ్డుకి వెళ్ళిపోయారు. ఇక త్రివిక్రమ్ లాంటి మాటల మాంత్రికుడు కూడా కామెడీ పండించడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇదిలా ఉండగా ఈ ఒక్క షోతో చాలా మంది నటులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఎంతో మంది జీవితాలు ఈ ఒక్క షో వల్ల సెట్ అయిపోయాయి.
ఆఫీసు నుండీ అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి ఈ షో ఎంతో నవ్విస్తుంది. ఇక ఆఫీసులో కూడా తీరిక సమయం దొరికినప్పుడు ఈ షో చూస్తున్నారంటే… ఈ షో వారికి ఎంత రిలీఫ్ ఇస్తుందో అర్ధంచేసుకోవచ్చు. శుక్రవారం సినిమాలకు హిట్టు టాక్ వచ్చినా.. జనాలు శనివారం రోజున ఆ హిట్టు సినిమా చూడొచ్చులే అని లైట్ తీసుకుంటున్నారు అంటే చాలా వరకూ జబర్దస్త్ వల్లే అని చెప్పాలి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొరకు కూడా ఈ షోలోని పంచ్ డైలాగులను వాడుకుంటూ వస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే… సినిమాల్లో నటీనటులు ఎంత సంపాదిస్తారో తెలీదు కానీ ఈ షో లో చేసే నటీనటులు, యాంకర్లు జడ్జ్ లు ఓ రేంజ్లో సంపాదిస్తున్నారు. మరి వాళ్ళ సంపాదన వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.
1) రోజా (జడ్జ్)
ఒక్కో ఎపిసోడ్ కు రోజా 2 నుండీ 3 లక్షల వరకూ తీసుకుంటూ వస్తున్నారట. నెలకి 8 ఎపిసోడ్ లు ఉంటాయి కాబట్టి.. ఎంతకాదనుకున్నా ఈమెకు 20 లక్షల వరకూ అందుతుందట.
2) నాగబాబు (జడ్జ్)
ఈ షో స్పెషల్ అట్రాక్షన్ నాగబాబు నవ్వే అన్న సంగతి అందరికీ తెలిసిందే. చిన్న జోక్ కు కూడా ఆయన 15 నిమిషాల వరకూ నవ్వుతుంటాడు. అలా నవ్వుతూనే నెలకు 25 లక్షల వరకూ సంపాదిస్తున్నాడట.
3) రష్మీ
‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒక్కో ఎపిసోడ్ కు 80 వేలు తీసుకుంటుందట. నెలకి ఎంతకాదుకున్నా ఆమెకు 3.5 లక్షలు వరకూ అందుతుందని తెలుస్తుంది.
4) అనసూయ
‘జబర్దస్త్’ మెయిన్ యాంకర్ అయిన అనసూయ ఎపిసోడ్ కు లక్ష వరకూ తీసుకుంటుందట. ఈమె సంపాదన నెలకు 4 లక్షలు ఉంటుందని తెలుస్తుంది.
5) టీం లీడర్లు : చమ్మక్ చంద్ర – 4 లక్షలు,
6) సుధీర్ : 3.5 లక్షలు వరకూ సంపాదిస్తున్నారట.
7) సుధీర్ టీమ్‌లో ఉండే గెటప్ శ్రీను 2.5 నుండీ 3 లక్షల వరకూ,
8) ఆటో రాంప్రసాద్ 2.5 నుండీ 3 లక్షల వరకూ పారితోషికం అందుకుంటున్నారట.
9) సాఫ్ట్ వేర్ చేస్తూ స్కిట్ లు చేసే అదిరే అభి 2 నుండీ 2.5 లక్షల వరకూ సంపాదిస్తున్నాడట.
10) హైపర్ అది అయితే ఏకంగా 3 లక్షల వరకూ తీసుకుంటున్నాడట. రే ఎంట్రీ ఇచ్చాక ఇంకాస్త ఎక్కువే అందుకుంటున్నాడని తెలుస్తుంది.
11) ఇక రాకెట్ రాఘవ 2.5 లక్షలు,
12) కిరాక్ ఆర్పీ 2.4 లక్షలు,
13) భాస్కర్ అండ్ టీం 2 లక్షలు,
14) చలాకీ చంటి 2 లక్షల వరకూ తీసుకుంటున్నారట.
15) సునామీ సుధాకర్ 1 లక్ష,
16) ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ వంటి వారు కూడా 1 లక్ష వరకూ తీసుకుంటున్నారట.