అంతకంటే చావడం నయం : రేణు దేశాయ్
- May 10, 2016 / 10:32 AM ISTByFilmy Focus
వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు వెళ్ళేకంటే నేరుగా వెళ్ళి చావడం నయమని అంటోంది నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. రేణు దేశాయ్ కి ఇంతకీ ఎందుకింత కోపం వచ్చిందని అనుకుంటున్నారా. పవన్, రేణుల ముద్దుల కుమారుడు అకీరా గాయపడగా.. అకీరాను రేణు ఓ పేరున్న ఆసుపత్రికి తీసుకువెళ్లింది.
గాయపడ్డ అకిరాను ఎవరు పట్టించుకోక పోవడంతో..’వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు వెళ్ళడం కంటే నేరుగా వెళ్ళి చావడం నయం. డాక్టర్లు, నర్సులు మానవత్వాన్ని చంపేస్తున్నార’ని తన ట్విటర్ అక్కౌంట్ లో రేణు తన ఆవేదన వ్యక్తం చేసింది. కాగా పవన్ నుంచి విడిపోయాక రేణు మరాఠీ చిత్రాలకు నిర్మాతగా మారింది.
Rather, directly die,than go to big hospitals for treatments!The insensitivity of the entire system frm docs to nurses kills d human spirit!
— renu (@renuudesai) May 9, 2016
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












