పవన్ మాజీ భార్య మళ్ళీ సంచలన కామెంట్లు..!
- April 10, 2019 / 04:45 PM ISTByFilmy Focus
ప్రముఖ కమెడియన్ అలీ షో అయిన ‘అలీతో సరదాగా’ కి తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ అతిథిగా వచ్చింది. దీనికి సంబందించిన ప్రోమోని తాజాగా విడుదల చేసారు. ఈ సందర్భంగా అలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది రేణూ దేశాయ్. ‘రేణూ’ అనే పేరు మీకు నచ్చదంట కదా అని అలీ అడిగిన ప్రశ్నకి… రేణూ సమాధానమిస్తూ.. ‘అవును.. నాకు నా పేరు అంటే అస్సలు నచ్చదు. రేవతి లేదా రేవ అని పెడితే బావుండేది’ అంటూ కామెడీ చేసింది.
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఫ్రేమకథా చిత్రం 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఎడిటర్ మీరే అంట కదా అని అలీ ప్రశ్నించగా..? రేణూ.. ‘నేను ‘జానీ’ ‘ఖుషి’ సినిమాలకు ఎడిటర్ గా పని చేశాను.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎస్.జె.సూర్య గారు, ఏ.ఎం.రత్నం గారు, కళ్యాణ్ గారే దీనికి సాక్ష్యం’ అంటూ చెప్పుకొచ్చింది. రేణూ పుట్టినప్పుడు తన తండ్రి ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్ కి రాలేదట. ఈ విషయాన్ని స్వయంగా రేణూ నే చెప్పి కంటతడి పెట్టుకుంది. ఈ వీడియో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘ఇది యాదృశ్చికమే…ఏమో తెలీదు కానీ… ఇద్దరూ పవన్ కళ్యాణ్ నుండీ దూరమైన వాళ్ళే.. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు’ అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.












