RGV: అలాంటి ప్రపంచాన్ని సృష్టించుకున్న వర్మ!

టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన రామ్ గోపాల్ వర్మను అభిమానించే వాళ్ల కంటే విమర్శించే వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆర్జీవీ దర్శకత్వం వహించిన సినిమాలలో ఏ సినిమా కూడా హిట్ కాలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తేజ తన గురించి ఒక ఇంటర్య్వూలో గుర్రం చూడని వ్యక్తికి సైతం వర్మ నీకంటే గుర్రపు స్వారీ ఎవరూ బాగా చేయలేరని నమ్మిస్తాడని చెప్పారని తెలిపారు.

ఇటీవల నా కాలేజ్ మేట్ ఒకరు మదర్ చనిపోయారని తనకు మెసేజ్ పెట్టారని తాను దానికి రిప్లై ఇవ్వలేదని వర్మ అన్నారు. పది రోజుల తర్వాత ఇలాంటి విషయం చెప్పినా కూడా రిప్లై కూడా ఇవ్వలేదని తను ఫీలైందని తాను డెత్ కు రియాక్ట్ కానని డెత్ అనేది తనకు ఇష్టం ఉండదని చెప్పానని వర్మ అన్నారు. మా ఫాదర్ చనిపోయిన సమయంలో తాను ఇంటికి చుట్టాలొచ్చి ఏడవటం నచ్చదని ఎవరినీ పిలవద్దని అమ్మకు చెప్పానని వర్మ చెప్పారు.

ఇంట్లో మా నాన్న ఫోటో ఉండటం కూడా తనకు నచ్చదని వర్మ పేర్కొన్నారు. నాన్నగారి ఫోటోను చూసి నాన్నగారు లేరని పదేపదే గుర్తు చేసుకుని అలా బ్రతకడం తనకు నచ్చదని వర్మ వెల్లడించారు. ఏ సమస్య లేని ప్రపంచాన్ని తాను సృష్టించుకున్నానని తాను రొమాంటిక్ యోగినని వర్మ తెలిపారు. వర్మ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటుండగా వర్మ హిట్ సినిమా తీస్తారో లేదో చూడాల్సి ఉంది.


‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus