RGV: తులసీ తీర్థం సినిమా మామూలుగా ఉండదు… పక్కా

Ad not loaded.

హారర్‌, థ్రిల్లర్‌ కథలు రాయడానికి స్పెషలిస్ట్‌ ఎవరు అంటే… యండమూరి వీరేంద్రనాథ్‌ అని ఠక్కున చెప్పొచ్చు. మరి అలాంటి కథలను సినిమాగా మల్చాలంటే ఎవరు స్పెషలిస్ట్‌ అంటే… ఇంకెవరు మన రామ్‌గోపాల్‌ వర్మ అని చెబుతారు. అలాంటి ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తే… అదిరిపోతుంది కదూ. ఇప్పుడు అదే జరుగుతోంది. అవును టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని కాంబినేషన్‌ సెట్‌ అయ్యింది. త్వరలో ఈ సినిమా స్టార్ట్‌ అవుతుందట. యండమూరి వీరేంద్రనాథ్‌ ఇటీవల ‘తులసితీర్థం’ పేరుతో ఓ నవల రాశారు.

గతంలో ఆయన నుండే వచ్చిన ‘తులసిదళం’ నవలకు ఇది కొనసాగింపు. దీనికి కూడా పాఠకుల నుండి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ నవలను సినిమాగా తీసుకురావాలని నిర్మాత తుమల్లపల్లి రామసత్యనారాయణ అనుకున్నారు. వెంటేనే తన భీమవరం టాకీస్‌ పతాకంపై ఈ సినిమాను రూపొందించాలని సిద్ధమయ్యారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. వర్మ సినిమా అంటే ఎక్కువ రోజులేం పట్టదు.

కాలెండర్‌లో నెల కాగితం తిప్పేలోపు కూడా ఆయన సినిమాలు పూర్తి చేసిన సందర్భాలున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి. అన్నట్లు వర్మ నుండి ఓ ప్లానింగ్‌ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఈ నేపథ్యంలో ‘తులసి తీర్థం’ ఎలా ఉంటుందో చూడాలి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus