తెలుగు సినిమా బిజినెస్ లెక్కలు మాట్లాడుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. స్టార్ హీరోల విషయంలో ఇది పెద్ద లేక్కే. అయితే రాజమౌళి తెరకెక్కించే సినిమాల దగ్గరకు వచ్చేసరికి ఇది ఇంకా పెద్ద లెక్క. ఇప్పుడు అలాంటి చర్చ జరుగుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత. ఇటీవల తమిళ వెర్షన్ కోసం లైకా సంస్థ కలసి పని చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు మరికొన్ని హక్కుల లెక్కలు ఇంకా కొనసాగుతున్నాయట.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చిత్రీకరణ చివరిదశకొస్తుండటంతో నిర్మాత బిజినెస్ పనుల్లో పడ్డారట. సినిమాకు ₹350 కోట్ల నుండి ₹400 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే… శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారానే బడ్జెట్‌ను వెనక్కి తెచ్చుకునే పనిలో దానయ్య ఉన్నారట. అందుకోసమే ఇటీవల వచ్చిన ₹300 కోట్ల డీల్‌ను ఇంకా ఓకే చెయ్యలేదట. డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో ఈ మొత్తం వచ్చేలా ఇటీవల చర్చలు జరిగాయట. అయితే నిర్మాత ఇంకా వీటిని ఫైనల్ చెయ్యలేదట. కారణం ఇంకా ఆయన మరో ₹50 కోట్లు – ₹100 కోట్లు ఆర్జించాలని చూడటమే.
‘ఆర్‌ఆర్‌ఆర్’ పాన్ ఇండియా రేంజిలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ₹150 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందట. దానయ్య మాత్రం ₹200 కోట్ల కోసం మరో ఓటీటీతో చర్చలు జరుపుతున్నారట. అంత పెట్టే ఓటీటీలు ఏమున్నాయా అంటే హాట్ స్టార్, నెట్ ఫిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మరి ఈ మూడింటిలో ఏది ఓకే అవుతుందో. శాటిలై రైట్స్ విషయంలోనూ ఇదే పరిస్థితి అంట. ₹130 కోట్లు- ₹140 కోట్ల బడ్జెట్‌తో స్టార్ మా ముందుకొచ్చిందట. అయితే నిర్మాత ₹150 కోట్లు – ₹160 కోట్లు దగ్గర ఉన్నారట. దీని కోసం ఉన్న ఇతర ఆప్షన్లు జీ తెలుగు, సన్ నెట్ వర్క్. ఇలా మొత్తంగా ₹350-360 కోట్లు ఆర్జించేలా నిర్మాత ఆలోచనలు చేస్తున్నారని టాక్.