తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ… ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్షన్లకు ఏమాత్రం బ్రేకులు పడలేదు. వీకెండ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ వీకెండ్ తర్వాత ఎక్కువ డ్రాప్స్ లేకుండా నిలకడగా రాణించింది. రాజమౌళి సినిమాలకి టాక్ తో సంబంధం ఉండదు అని ‘ఆర్.ఆర్.ఆర్’ మరోసారి నిరూపించింది. బాహుబలిని మించి అని రాజమౌళి మొదటి నుండీ ఈ మూవీని ప్రమోట్ చేయడంతో వీకెండ్ వరకు ఆ ఫీట్ ను సాధించింది.మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ 80 శాతం పైనే రికవరీని సాధించింది.
8 వ రోజున కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసింది. ఉగాది సెలవు ఉంది కాబట్టి.. సెకండ్ వీకెండ్ బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
ఒకసారి 8 డేస్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
80.89 cr
సీడెడ్
38.23 cr
ఉత్తరాంధ్ర
21.38 cr
ఈస్ట్
11.37 cr
వెస్ట్
09.98 cr
గుంటూరు
14.13 cr
కృష్ణా
11.07 cr
నెల్లూరు
06.63 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
193.68 cr
తమిళనాడు
27.07 cr
కేరళ
08.25 cr
కర్ణాటక
29.30 cr
హిందీ
71.42 cr
ఓవర్సీస్
76.38 cr
రెస్ట్
05.90 cr
టోటల్ వరల్డ్ వైడ్
412.00 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.412 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.748 కోట్లను కొల్లగొట్టింది.బ్రేక్ ఈవెన్ విషయంలో సందేహపడనవసరం లేదు కానీ ఫుల్ రన్లో ఈ చిత్రం ‘బాహుబలి2’ కలెక్షన్లను అధిగమించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రెండో వీకెండ్ అయితే భారీగా క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.