ప్రస్తుతం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఆర్ఆర్ఆర్ మూవీ మినహా మరో సినిమా గురించి చర్చ జరగడం లేదు. రాజమౌళి, తారక్, చరణ్ వరుస ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను పెంచుతుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తో హీరోలు, దర్శకుడు రాజమౌళి ఇప్పటికే క్రియేట్ అయిన రికార్డులను తొక్కుకుంటూ పోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో బెనిఫిట్ షోలకు 5,000 రూపాయలకు ఆర్ఆర్ఆర్ టికెట్ అమ్ముడైందంటే ఈ సినిమా రేంజ్ ఏమిటో సులువుగానే అర్థమవుతుంది.
మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ దెబ్బకు ఇతర సినిమాల ప్రమోషన్స్ తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఆర్ఆర్ఆర్ మూవీకి పోటీగా థియేటర్లలో మరే సినిమా విడుదల కావడం లేదనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ వీడియోలకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుండగా ఇతర సినిమాల ప్రమోషన్స్ కు మీడియాలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. ఆర్ఆర్ఆర్ మినహా ఇతర సినిమాల ఈవెంట్లు కూడా జరగడం లేదు. రిలీజ్ తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కొన్నిరోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల దగ్గర రాజమౌళి కటౌట్ లు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా హీరోలకు థియేటర్ల దగ్గర కటౌట్ లు ఉంటాయి. రాజమౌళి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తో జక్కన్న క్రేజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీకి టికెట్ రేట్లతో సంబంధం లేకుండా బుకింగ్స్ జరుగుతున్నాయి.
భారీ అంచనాలతో విడుదలవుతున్న ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. బెంగళూరులో కూడా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.