స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆలోచనలు ఇతర డైరెక్టర్ల ఆలోచనలకు భిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఏ సన్నివేశంను ఏ విధంగా తెరకెక్కించాలో మనస్సులోనే ఊహించుకుని ఆ ఊహను తెరపైకి తీసుకొనిరావడానికి కష్టపడుతున్న డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. సాధారణంగా రాజమౌళి సినిమాలు ఎక్కువ నిడివితో తెరకెక్కుతాయి. బాహుబలి2, ఆర్ఆర్ఆర్ ఎక్కువ నిడివితో తెరకెక్కి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ సినిమాలు ఎక్కువ నిడివితో తెరకెక్కినా ఈ సినిమాలలోని చాలా సన్నివేశాలు డిలీట్ అయ్యాయని వార్తలు వచ్చాయి.
అయితే డిలీట్ అయిన సన్నివేశాల్లో చరణ్ కు సంబంధించిన కీలక సన్నివేశం కూడా ఉందని సమాచారం అందుతోంది. సినిమాలో రామరాజు పుట్టిన సమయంలో ఋషి నుంచి ఆశీర్వాదం పొందుతున్న సీన్ ను డిలీట్ చేశారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. సినిమాలో ఈ సీన్ ను డిలీట్ చేశారని నెటిజన్లు, చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో ఈ సీన్ ఉండి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ పోస్టర్ గురించి ఆర్ఆర్ఆర్ టీమ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ జైలులో అనుభవించే కష్టాలకు సంబంధించిన కొన్ని సీన్లు డిలీట్ అయ్యాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆర్ఆర్ఆర్ ఓటీటీ వెర్షన్ డిలీటెడ్ సీన్లతో పాటు అందుబాటులోకి వస్తుందని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. రాబోయే రోజుల్లో అయినా డిలీటెడ్ సీన్లను జక్కన్న రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
డిలీటెడ్ సీన్లను రిలీజ్ చేస్తే ఈ సీన్లను సినిమాలో ఎందుకు పెట్టలేదని కామెంట్లు వచ్చే అవకాశం ఉందని జక్కన్న భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో 1150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.