కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించి జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో జరిగిన జ్యూరీ విలేకరుల సమావేశంలో విజేతలను ప్రకటించారు. బెస్ట్ తెలుగు ఫిల్మ్ క్రిటిక్ విభాగంలో పురుషోత్తమచార్యులను జాతీయ అవార్డ్ వరించడం గమనార్హం. బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డ్ ను ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ఉప్పెన మూవీ సొంతం చేసుకుంది. నేషనల్ అవార్డ్స్ లో జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ హవా కొనసాగింది.
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ ను (RRR Movie) ఆర్ఆర్ఆర్ సినిమాకు పని చేసిన కింగ్ సోలోమాన్ సొంతం చేసుకున్నారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ విభాగంలో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కు ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి అవార్డ్ వరించింది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో సైతం ఆర్ఆర్ఆర్ మూవీ అవార్డ్ ను సొంతం చేసుకుంది. వి శ్రీనివాస మోహన్ కు ఈ అవార్డ్ దక్కింది. బెస్ట్ లిరిక్స్ విభాగంలో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన కొండపొలం సినిమాలోని ధం ధం ధం సాంగ్ కు అవార్డ్ వచ్చింది.
ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ కేటగిరీలో సాంగ్స్ కు సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ కు అవార్డ్ రాగా బీజీఎంకు సంబంధించి కీరవాణికి అవార్డ్ వచ్చింది. బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డ్ సైతం ఆర్ఆర్ఆర్ కు రావడం గమనార్హం. కొమురం భీముడో సాంగ్ పాడిన కాల భైరవ ఈ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను బన్నీ సొంతం చేసుకున్నారు.
పుష్ప ది రైజ్ సినిమాకు ఈ అవార్డ్ రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో ఆర్ఆర్ఆర్ కు అవార్డ్ దక్కింది. అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ డామినేషన్ కనిపించడంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.