RRR: ఆస్కార్ వచ్చే వేళ… తిరిగి విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. విడుదల ఎప్పుడంటే?

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి గత ఏడాది మార్చి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ఇతర దేశాల ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇలా వీరినటన అంతర్జాతీయ స్థాయికి చేరిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ దర్శక నిర్మాతల నుంచి ప్రశంసలు అందడం విశేషం అలాగే ఇప్పటికే ఎన్నో రకాల ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను అందుకున్నటువంటి ఈ సినిమా ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచింది.

ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన నాటునాటు పాట ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే గోల్డెన్ గ్లో అవార్డు అందుకున్నటువంటి ఈ పాట తప్పకుండా ఆస్కార్ కూడా అందుకుంటుందని భావిస్తున్నారు. ఇక ఆస్కార్ వేడుకలను ఈ నెల 12వ తేదీ ప్రకటించనున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ల నిమిత్తం ఇప్పటికే చిత్ర బృందం అమెరికా చేరుకొని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా పలు ప్రాంతాలలో తిరిగి ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డులు ప్రకటించే తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తిరిగి ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీ ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో తిరిగి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలబడనుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా పట్ల అందిన ప్రశంసలు అవార్డులు కనుక చూస్తే తప్పకుండా ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus