ఇంటర్నేషనల్‌గా మారుమోగుతున్న వేళ మళ్లీ తెలుగు నాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

బై క్లాప్‌ ఏదైనా సినిమా ఇటీవల కాలంలో హిట్‌ టాక్‌ తెచ్చుకుందా అంటే అది కచ్చితంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అని చెప్పాలి. సినిమా కాంబినేషన్‌, కాన్సెప్ట్‌ అలాంటిది మరి. తెలుగు సినిమాగా అనుకుని, పాన్‌ ఇండియా సినిమాగా విడుదలై.. ఇప్పుడు గ్లోబల్‌ మూవీగా మారిపోయింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. విదేశాల్లో వరుస పురస్కారాలు అందుకుంటూ ‘ఆస్కార్‌’వైపు దూసుకెళ్తోంది. ఈ సమయంలో సినిమాను మరోసారి థియేటర్‌లో చూస్తే.. ఆ ఫీలే సూపర్‌ అంటారా? అవును, ఆ ఫీల్‌ మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.

రామ్‌చరణ్‌ – రాజమౌళి – తారక్‌ కాంబోలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను మరోసారి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారని సమాచారం. రీరిలీజ్‌ల ట్రెండ్‌ జోరుగా సాగుతున్న ఈ సమయంలో ఈ సినిమాను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతోంది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటికీ ఈ సినిమా ఎక్కడో చోట రిలీజ్‌ అవుతూనే ఉంది. ఇప్పుడు మీరు ఈ వార్త చదువుతున్నప్పుడు కూడా ఎక్కడో కొత్తగా తొలి ఆట పడే ఉంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా తెలుగులో ఈ చిత్రం రీ రిలీజ్ కావడానికి సిద్ధం అయ్యింది.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ‘దేవి 70 ఎం ఎం’ థియేటర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. జనవరి 20 నుండి సినిమా పడనుండగా ప్రస్తుతానికి 5 రోజులు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్‌ బట్టి ఎన్ని రోజులు సినిమా వేయాలి అనేది నిర్ణయిస్తారు అని తెలుస్తోంది. కేవలం దేవిలోనే కాదు.. నగరంలోని మరికొన్ని థియేటర్లలో కూడా సినిమా వేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడి ఫలితం బట్టి తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా సినిమా రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట.

ఆస్కార్‌ పురస్కార వేడుక జరిగే సమయం అంటే మార్చిలో ఈ సినిమాను రీరిలీజ్‌ చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే దానికి ఇంకా చాలా రోజులు ఉండటంతో ఇప్పుడే వేసేస్తున్నారు అంటున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ షోలు వేస్తున్నారని కూడా అంటున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus