రాజమౌళిని ముప్పుతిప్పలు పెడుతుంది ఆర్ ఆర్ ఆర్. ప్రాజెక్ట్ మొదలుపెట్టిన నాటి నుండి అన్నీ అవాంతరాలే. అనేక అపశకునాలు ఈ ప్రాజెక్ట్ ని సవ్యంగా సాగనీయలేదు. దీనితో అనుకున్న సమయానికి కంటే ఏడాది వెనక్కు వెళ్ళిపోనుంది. రాజమౌళి మొదట 2020 జులై 31 ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీగా ప్రకటించారు. అనుకున్న సమయానికి షూట్ పూర్తి కానీ నేపథ్యంలో 2021 జనవరి 8కి మార్చడం జరిగింది. ఈ లాక్ డౌన్ ఎంట్రీతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి, దాని విడుదల అనేది అగమ్య గోచరంగా మారింది.
కనీసం ఆర్ ఆర్ ఆర్ 2021లో అయినా విడుదల అవుతుందా అనే అనుమానం ప్రేక్షకులలో మొదలైపోయింది. అటు ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ నుండి, నిర్మాత నుండి రాజమౌళిపై ఒత్తిడి పెరిగిపోతుండగా ఆయన కూడా వీలైనంత త్వరగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలుపెట్టే మార్గాలు వెతుకున్నారు. దసరా తరువాత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని కథనాలు వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన ఏమీ విడుదల కాలేదు.
ఐతే ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అక్టోబర్ 10న రాజమౌళి బర్త్ డే సంధర్భంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీపై ప్రకటన ఉంటుందని టాలీవుడ్ వర్గాల బోగట్టా. మరో రెండు వారాలలో రాజమౌళి బర్త్ డే కాగా దీనిపై ప్రకటన వస్తే బాగుండని ఫ్యాన్స్ సైతమ్ కోరుకుంటున్నారు .