RRR Movie: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ స్టోరీ లైన్ ఐడియా ఇచ్చిందెవరో తెలుసా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ రానుందని చాలా సందర్భాల్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైరల్ అవుతున్న వార్తలు నిజమేనని తెలియడంతో పాటు ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ స్టోరీ లైన్ ను సిద్ధం చేశారని బోగట్టా. అన్ని వర్గాల ఫ్యాన్స్ కు నచ్చేలా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉండబోతుందని సమాచారం అందుతోంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ పూర్తైన వెంటనే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ షూట్ దిశగా అడుగులు పడనున్నాయని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న వార్తలు ఈ సినిమాపై మరింత ఎక్కువగా ఆసక్తిని పెంచుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ అంటే చరణ్ తారక్ కాంబోలో మరో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ దిశగా అడుగులు పడాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.

సాధారణంగా ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ మరింత ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధిస్తుందని ఇప్పటికే విడుదలైన పలు సినిమాలు ప్రూవ్ చేశాయి. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ విషయంలో అదే జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ను ఊహించని రేంజ్ లో జక్కన్న ప్లాన్ చేశారని బోగట్టా. అయితే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ లో ఇద్దరు హీరోల పాత్రలను బ్యాలెన్స్ చేసేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీ విదేశీ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటుందనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ను డీవీవీ దానయ్య నిర్మిస్తారా లేక మరో నిర్మాత నిర్మిస్తారా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus