సినిమా విషయంలో తన ఆలోచనలు ఆకాశాన పెట్టి… ఉన్నతంగా ఆలోచించే రాజమౌళికి ఒక పట్టాన ఏది నచ్చదు. ఆయన ఏ విషయంలో నైనా బెస్ట్ కోరుకుంటాడు. వచ్చిన అవుట్ ఫుట్ తో సరిపెట్టుకొని కాంప్రమైజ్ అయ్యే రకం కాదు . బాహుబలి లాంటి సినిమా అంతటి విజయం అందుకోవడానికి, తక్కు వబడ్జెట్లో అంత పెద్ద చిత్రం తెరకెక్కించ గలగడానికి కారణం అదే. మరి ఆయన చేపట్టి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా ఆయన ఆలోచన అలాగే ఉంటుంది. ఐతే మునుపటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కరోనా వైరస్ మరియు లాక్ డౌన్ మొత్తం మార్చివేశాయి.
రాజమౌళి కూడా ఎంతో కొంత మేర కాంప్రమైజ్ కావలసిందే. ఆయన మడిగట్టుకు కూర్చుంటే ప్రాజెక్ట్ ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. హైదరాబాద్ వేదికగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం ఓ భారీ సెట్ ఏర్పాటు చేశారు రాజమౌళి. ఈ సెట్ లో పరిమిత సిబ్బంది మరియు నటులతో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేయాలన్నది ఆయన ఆలోచన. ఐతే ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాను అందుబాటులో ఉన్న వనరులతో పూర్తి చేయడం సాధ్యమేనా అనే డౌట్ రాజమౌళిలో ఉంది.
అందుకే ఆయన మూడు రోజుల మాక్ షూటింగ్ ఏర్పాటు చేయాలని భావించారు. ఐతే ఆ మాక్ షూటింగ్ కూడా ఆయన నిలిపివేసినట్టు తెలుస్తుంది. దానికి కారణం అందుబాటులో ఉన్న సిబ్బందితో ఆర్ ఆర్ ఆర్ ని అద్భుతంగా తెరకెక్కించడం సాధ్యం అయ్యే పనికాదని రాజమౌళి నిర్ణయానికి వచ్చారట. లేటైనా కొన్నిరోజులు ఆగడమే మంచిదనే ఆలోచనలో ఆయన ఉన్నారట. దీనితో ఇప్పట్లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఉండకపోవచ్చని కొందరు అంటున్నారు.
Most Recommended Video
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!