ఆర్ ఆర్ ఆర్ పై ప్రేక్షకులలో ఎంత ఆసక్తి నెలకొని ఉందో ఆ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ నే ఉదాహరణ. ఇప్పటికే ఈ చిత్రం బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్ దాటివేసింది. అలాగే బాహుబలికి మించి ఈ చిత్రాన్ని పది భాషలలో విడుదల చేయాలనే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. కాగా మేకింగ్ విషయంలో కూడా ఆర్ ఆర్ ఆర్ బాహుబలిని తలదన్నే విధంగా ఉండేలా రాజమౌళి నిర్మిస్తున్నారట. బాహుబలి సిరీస్ లో యుద్ధ సన్నివేశాలు సినిమాలకు ఆయువు పోశాయి. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలలో యుద్ధ సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ లో యాక్షన్ అంతకు మించి అన్నట్లు ఉండేలా జక్కన్న ఈ చిత్రాన్ని చెక్కుతున్నారట. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా చరణ్ తెరపై కనిపిస్తుండగా వీరిపై వచ్చే యాక్షన్ సన్నివేశాలు భారీగా విజువల్ వండర్ లా ఉంటాయట. యుద్ధ సన్నివేశాలలతో పాటు, ఫైట్ సన్నివేశాలకు క్వాలిటీ వి ఎఫ్ ఎక్స్ జోడించి అబ్బురపరిచేలా తీర్చిదిద్దాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ లో యాక్షన్ సన్నివేశాలు బాహుబలిని మించి ఉండడం ఖాయం అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2021 జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్