RRR: ఆర్ఆర్ఆర్ అవార్డు వేడుకలలో కనిపించని దానయ్య అసలేం జరుగుతోంది!

తెలుగు సినిమా స్థాయి ఏంటో అంతర్జాతీయ స్థాయిలో నిరూపించిన చిత్రం RRR.రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది మార్చి 23వ తేదీ విడుదల అయ్యి సంచలనాలను సృష్టించింది. కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సినిమా ఎంతో మంచి ప్రశంసలను అందుకుంది. ఇలా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఇప్పటికే ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది.

అయితే ఇప్పటికే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకోగా ఈ అవార్డు వేడుకలలో చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. కానీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించినటువంటి దానయ్య మాత్రం ఏ అవార్డు వేడుకలలోను కనిపించలేదు. ఈ విధంగా దానయ్య ఈ సినిమా అవార్డు వేడుకలకు దూరంగా ఉండటంతో చాలామంది చిత్ర బృందం కావాలనే దానయ్యను పక్కన పెట్టారా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమా అవార్డు వేడుకలకు దానయ్య దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… నిజానికి దానయ్య RRRసినిమా వేడుకలలో ఇండియాలో మాట్లాడటానికి కాస్త తడబడ్డారు. ఇలాంటి ఈయనని విదేశాలకు తీసుకెళ్లి అక్కడ వేదికలపై ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని భావించిన ఇతర చిత్ర బృందం ఈ సినిమా బరువు బాధ్యతలను వారి భుజాలపై వేసుకొని ఆయనకు వచ్చిన అవార్డులను కూడా రాజమౌళి అందుకుంటున్నారని తెలుస్తోంది.

అందుకే దానయ్య ఈ సినిమా అవార్డుల వేడుకకు దూరంగా ఉన్నారని అంతకుమించి మరే కారణం లేదని సమాచారం.అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకలలో అయినా దానయ్య కనిపిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus