దాదాపుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చరణ్, తారక్, రాజమౌళి వరుసగా మీడియా సమావేశాలను నిర్వహిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన సీక్రెట్లను వెల్లడిస్తున్నారు. అయితే ఏపీలో టికెట్ రేట్ల సమస్య ఆర్ఆర్ఆర్ నిర్మాతలను టెన్షన్ పెడుతోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఏపీలో ఉన్న తక్కువ టికెట్ రేట్ల వల్ల రికార్డులు క్రియేట్ చేసే స్థాయిలో కలెక్షన్లు సాధించడం సాధ్యం కాదు. ఏపీలో ఆర్ఆర్ఆర్ కు కలెక్షన్లు తగ్గితే ఆ ప్రభావం ఆర్ఆర్ఆర్ మూవీ టోటల్ కలెక్షన్లపై పడుతుంది. నిర్మాత దానయ్య సినిమా టికెట్ ధరల విషయం గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని త్వరలోనే టికెట్ రేట్లు పెరుగుతాయని భావిస్తున్నామని మీడియాకు చెబుతున్నారు.
అయితే ఇదే సమయంలో నిర్మాత దానయ్య కోరిక మేరకు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్ల పెంపు కోసం వైసీపీ నేతల సహాయం కోరే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు బాగా పరిచయం ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కష్టపడితే ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్ల పెంపుకు అనుకూలంగా ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఎన్టీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తారా? లేదా? చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ కు మాత్రమే టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చినా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంది.
వరుసగా భారీ సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో పుష్ప మేకర్స్, రాధేశ్యామ్ మేకర్స్ కూడా ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే బాగుంటుందని భావిస్తున్నారు. పెద్ద నిర్మాతలు ఫ్లెక్సీ రేట్లు, అదనపు షోల అనుమతుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు తాజాగా ఏపీ వరదల గురించి స్పందించి భారీ విరాళాలు ప్రకటించారు. టాలీవుడ్ హీరోల చర్యతో టికెట్ రేట్ల విషయంలో ఏపీ సీఎం జగన్ మనస్సు మారుతుందేమో చూడాల్సి ఉంది. పుష్ప మూవీ మేకర్స్ టికెట్ రేట్ల విషయంలో తమకింకా ఆశాభావం ఉందని వెల్లడించారు. ఏపీలో సినిమా టికెట్ రేట్లు గరిష్టంగా 250 రూపాయలుగా ఉండగా కనిష్టంగా 5 రూపాయలుగా ఉండటం గమనార్హం.