మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు సీడెడ్ ఏరియాలో భారీస్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరు హీరోల సినిమాలకు సీడెడ్ లో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి. చరణ్, తారక్ ఒకే సినిమాలో కలిసి నటించడంతో ఆర్ఆర్ఆర్ సీడెడ్ హక్కులు కళ్లు చెదిరే రేటుకు అమ్ముడయ్యాయి. నాలుగు జిల్లాలు ఉన్న ఏరియా అయినప్పటికీ ఇక్కడి బయ్యర్లు ఆర్ఆర్ఆర్ పై ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల 45 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను తొలిరోజే చూడాలని ఆన్ లైన్ లో టికెట్లను బుకింగ్ చేసుకోవాలనే సీడెడ్ ప్రేక్షకులకు నిరాశ ఎదురవుతోంది. కర్నూలు, కడప జిల్లాలలో ఆర్ఆర్ఆర్ కు ఆన్ లైన్ లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఒకటి లేదా రెండు థియేటర్లలో టికెట్ల బుకింగ్స్ ఓపెన్ అయినా 26వ తేదీ నుంచి మాత్రమే ఆన్ లైన్ లో ఆర్ఆర్ఆర్ టికెట్లు కనిపిస్తున్నాయి. రాయలసీమలోని కొన్ని మండలాల్లో ఏ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ రిలీజవుతుందో ప్రేక్షకులకు క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు మరో 36 గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో బయ్యర్లు ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా టికెట్లను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తొలిరోజు సీడెడ్ లోని కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ లో మాత్రమే టికెట్లు దొరికే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సీడెడ్ లో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఈ సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీని ఎలాగైనా తొలిరోజు థియేటర్లలో చూడాలని భావిస్తున్న సీడెడ్ అభిమానులకు నిరాశ ఎదురవుతోంది. ఆంధ్రాలోని కొన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.