ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే సమ్మోహనడా అనే పాట మారుమ్రోగిపోతుంది. చిన్నపిల్లల సెల్ఫోన్ లో పాటలు దగ్గర నుంచి పెద్ద వాళ్ళ కాలర్ టోన్ ..ముసలి వాళ్లు సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ ఈ పాటనే వింటున్నారు . అంతలా ఒక్క పాటతోనే కోట్ల పబ్లిసిటీని సంపాదించుకుంది “రూల్స్ రంజన్” మూవీ టీం. కాగా ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాకి ఏ ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. ఇదే క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ..”సమ్మోహనుడా సాంగ్ షూటింగ్ తీసే సమయంలో నేహా కి తనకు పెద్ద గొడవైందని ఏకంగా మూడు నెలల పాటు మాట్లాడుకోలేదన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు”. ఈ సాంగ్ షూటింగ్లో ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న వాటర్ లో నేహా శెట్టి దిగి మూడు సీన్స్ చేయాలని ..
మొదట సీన్ బాగానే చేసిన ఆమె (Neha Shetty) టెంపరేచర్ కి తట్టుకోలేకపోయిందని.. గట్టిగట్టుగా అరుస్తూ త్వరగా తీయండి అని ఫోర్స్ చేసిందని .. దీంతో నేను మిగతా రెండు సీన్స్ షూట్ చేయక ముందే వాటర్ లో నుంచి బయటకు వచ్చేసిందని నాకు కోపం వచ్చి గట్టిగా అరిచారని.. ఆ కోపంతో ఆమె మూడు నెలలు నాతో మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు .
అంతేకాదు సాంగ్ ఎడిట్ చేస్తున్న టైంలో ఆమె పడిన బాధ చూసి నాకే పాపం అనిపించింది అని.. అందుకే నేనే కాల్ చేసి సారీ చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చాడు జ్యోతి కృష్ణ. ప్రజెంట్ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!