Pawan Kalyan: ఇలాంటి పుకార్లు ఎక్కడ నుండి వస్తాయో ఏంటో? దీనికి కూడా క్లారిటీ ఇవ్వాలా ఏంటి?

రూమర్లు చాలా స్వీట్‌గా ఉంటాయి. అందుకేనేమో ఇలా పుట్టడం ఆలస్యం అలా అంతా తిరిగేసి అందరి చెవులు తీపి చేసి వచ్చేస్తాయి. అలాంటి ఓ రూమర్‌ ఇప్పుడు టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అది వింటుంటే ఇలాంటి పుకార్లు ఎక్కడ నుండి వస్తాయో ఏంటో? అని తప్పక అంటారు. ఎందుకంటే అలాంటి పరిస్థితి రావడం కష్టం అని అంటున్నారు. అదే ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ నుండి మైత్రీ మూవీ మేకర్స్‌ తప్పుకుంటోంది అని. నవ్వొస్తోందా చదువుతుంటే.. అందుకే మేం కూడా రాశాం.

(Pawan Kalyan) పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ అనే సినిమా ప్రకటించారు. సినిమా ప్రారంభానికి అంతా సిద్ధం అనుకుంటుండగా.. వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇది 2021 సెప్టెంబరులో జరిగింది. ఆ తర్వాత ఆ సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’గా మారింది. ఇటీవల ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా అయ్యింది, ఇప్పుడు మరో షెడ్యూల్‌ కూడా ఉంటుంది అని చెప్పారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

అయితే ఈ సమయంలో నిర్మాతలు మారుతున్నారు అంటూ వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం పవన్‌ వారాహి యాత్ర అని అంటున్నారు. ఈ యాత్ర రెండో విడత ప్రారంభం అవుతుండటంతో సినిమా షూటింగ్‌లకు గ్యాప్‌ వస్తుందని నిర్మాతలు వెనక్కి వెళ్లిపోతున్నారని పుకార్లు వచ్చాయి. అయితే ఇన్నాళ్లూ ఆగిన నిర్మాతలు ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్తారు చెప్పండి. ఈ పాయింట్‌ మరచిపోయి ఎందుకు పుకార్లు రేపారో వాళ్లకే తెలియాలి.

దీనికి క్లారిటీ కోసం వెయిట్‌ చేయడం నిష్ఫలం అని అర్థం చేసుకోవాలి అని సినిమా టీమ్‌ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. గతంలో ఈ సినిమా నుండి దర్శకుడు తప్పుకుంటారని కూడా ఇలానే వార్తలొచ్చాయి. అయితే అది ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ టైమల్‌లో లెండి. ఇప్పుడు నిర్మాతల వంతు అన్నమాట. పుకార్లు షికారు ఆగాలంటే కొత్త షెడ్యూల్‌ మొదలవ్వాల్సిందే.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus