Devara: దేవర ట్రైలర్ గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర(Devara) మూవీ థియేటర్లలో విడుదల కావడానికి సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ సైతం ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర మూవీ నుంచి గ్లింప్స్ మినహా వీడియో అప్ డేట్స్ ఏవీ రాలేదు. దేవర టీజర్ లేకుండానే డైరెక్ట్ గా ట్రైలర్ రిలీజ్ కానుంది.

Devara

అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం దేవర ట్రైలర్ సెప్టెంబర్ నెల 7వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో సినిమా విడుదలకు మూడు వారాల ముందే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఇందుకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ తొలి ప్రాజెక్ట్ దేవర కావడం గమనార్హం.

దర్శకుడు కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా హిట్టైతే టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో ఈ బ్యానర్ కూడా ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ రేటు ఒకింత తక్కువే కాగా దేవర సినిమా సక్సెస్ రేట్ ను పెంచే సినిమా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కు సోలో హీరోగా దేవర సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకం అని చెప్పవచ్చు. తారక్ భవిష్యత్తు సినిమాల బడ్జెట్లు, బిజినెస్ లెక్కలు దేవర సినిమాపై ఆధారపడ్డాయని చెప్పవచ్చు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ఎంపికలో, దర్శకుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవర బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus