యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ హీరో రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. కరోనా కేసులు పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీలలో విడుదలవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉన్నా ఆ తేదీకి థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదనే చెప్పాలి. అయితే అధికారికంగా మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించలేదు.
ఇప్పటికే రిలీజైన బెల్ బాటమ్ మూవీ కలెక్షన్లు చూసి బాలీవుడ్ లో కొత్త సినిమాలు రిలీజ్ చేయడానికి బాలీవుడ్ హీరోలు టెన్షన్ పడుతున్నారు. బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ ఓటీటీలో రిలీజ్ కానుందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ సినిమా హిందీ హక్కులు సొంతం చేసుకున్న పెన్ మూవీస్ సంస్థ ఆర్ఆర్ఆర్ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పింది. తమ సంస్థ నుంచి రిలీజవుతున్న మరో సినిమా యాక్షన్ కూడా థియేటర్లలోనే రిలీజవుతుందని ఈ సంస్థ స్పష్టం చేసింది.
పాన్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజైతే థియేటరను శాశ్వతంగా మూసుకోవాల్సి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి 2 సినిమాను మించి ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.