ఒక సారి దొంగ అని ముద్ర పడితే చాలు.. అతను చేసే ప్రతి పనిపై అనుమానం కలుగుతుంటుంది. అలాగే ఒక బ్యాచ్ లో ఒకరు తప్పు చేస్తే .. ఆ బ్యాచ్ లోని వారందరూ తప్పు చేసేవారని నింద పడుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేసిన తప్పిదం వల్ల పరిశ్రమలోని అందరిని అనుమానించాల్సి వస్తోంది. అజ్ఞాతవాసి సినిమా మొదలయినప్పటి నుంచి ఇది ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కి కాపీ అని అందరూ చెప్పారు. త్రివిక్రమ్ నోరు మెదపలేదు. ఇప్పుడు ఆ చిత్ర డైరెక్టర్ కేసు పెడుతానని చెప్పడంతో టాలీవుడ్ డైరక్టర్స్ పై మచ్చ పడింది. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ నెల 26 న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీ కథ కూడా 1990 లో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా మూల కథ ఆధారంగా రాసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ రూమర్ సినిమా రిలీజ్ ఆయిన్ తర్వాత నిజమవుతుందేమోనని అందరూ అనుకుంటున్నారు. అసలే ఈ సినిమా మొదలయినప్పుడు ఈ సినిమా కథని కొరటాల రాయలేదు.. శ్రీహరి నాను అనే రచయిత నుంచి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కొరటాల అతనికి కోటి రూపాయలు ఇచ్చారని, అయినా టైటిల్ కార్డులో అతని పేరు ఉంటుందా? ఉండదా ? అని అతని తరుపు వాళ్ళు సినిమాకోసం ఎదురుచూస్తున్నారని టాక్. మరి “భరత్ అనే నేను” విషయంలో ఏ రూమర్ నిజమవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.