నెగిటివ్ టాక్ తో సంబంధం లేకుండా నార్త్ ఏరియాల్లో బాక్సాఫీస్ ను చీల్చి చెండాడుతున్న “సాహో” కలెక్షన్స్ చూసి తెలుగోళ్ళందరూ తొడలు కొట్టేసుకొంటున్నప్పటికీ.. “సైరా” మేకర్స్ మాత్రం తమ సినిమా విడుదల విషయంలో టెన్షన్ పడుతూనే ఉన్నారు. అందుకు కారణం.. నార్త్ స్టేట్స్ లో ఇరగాడుతున్న “సాహో”.. ఓవర్సీస్ లో ముఖ్యమైన ఏరియా అయిన “నార్త్ అమెరికా”లో కనీస స్థాయిలో కూడా పెర్ఫార్మ్ చేయడం లేదు. ఓవర్సీస్ లో సాహో హిట్ అవ్వాలంటే దాదాపు 6 మిలియన్ వసూలు చేయడం లేదు. కానీ.. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ఓవర్సీస్ లైఫ్ టైమ్ రన్ మొత్తంలో మూడు మిలియన్ కూడా వసూలు చేసే అవకాశం కనిపించడం లేదు.
దాంతో.. ఆల్రెడీ “సాహో” పుణ్యమా అని భారీ నష్టాలు ఎదుర్కొనే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ “సైరా” సినిమాని భారీ మొత్తం పెట్టి కొంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. చిరంజీవి మునుపటి చిత్రం ఓవర్సీస్ లో 2.4 మిలియన్ వసూలు చేసి.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అందుకే.. రామ్ చరణ్ కూడా ఇప్పటివరకూ “సైరా” ఓవర్సీస్ హక్కులను మాత్రం అమ్మలేదు. మరి ఈ సాహో రిజల్ట్ సైరాపై ఎంతవరకూ ఉంటుంది అనేది తెలియాలంటే కొన్నాళ్లపాటు ఆగాల్సిందే.