Sahu Garapati: చిరంజీవి – అనిల్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడు ప్రారంభిస్తారంటే?

Ad not loaded.

కొన్ని సినిమాలు సెట్‌ అవ్వడం అంత ఈజీనా, సినిమాల అనౌన్స్‌మెంట్‌ ఇంత ఈజీనా అని అనిపిస్తుంది కొన్ని సినిమాల ప్రకటనలు చూస్తే. అలాంటి వాటిలో చిరంజీవి (Chiranjeevi) – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) సినిమా ఒకటి. వెంకటేశ్‌ (Venkatesh) సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam)  ప్రచారంలో భాగంగా చిరంజీవి సినిమా ప్రస్తావన వచ్చింది, దానికి దర్శకుడు అనిల్‌ రావిపూడి రియాక్షన్‌ కారణంగా సినిమా బయటకు వచ్చింది. నిర్మాత కూడా ఆ తర్వాత మాట్లాడారు. అలా చిరంజీవి – అనిల్‌ రావిపూడి సినిమా అనౌన్స్‌మెంట్‌ అయిపోయింది.

Sahu Garapati

అయితే అఫీషియల్‌గా సినిమాను ఓ స్పెషల్‌ వీడియోతో సినిమాను అనౌన్స్‌ చేస్తారని టాక్‌. త్వరలోనే ఆ వీడియో షూటింగ్‌ ఉంటుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి మరో ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు ఆ సినిమా నిర్మాత సాహు గారపాటి. సినిమా రిలీజ్‌, స్టార్టింగ్‌ డేట్స్‌ను సుమారుగా చెప్పుకొచ్చారాయన. దీంతో ఆ విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సాహు గారపాటి (Sahu Garapati) నిర్మాణంలో ప్రస్తుతం ‘లైలా’ (Laila)  అనే సినిమా రూపొందింది.

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)  ‘హీరో’యిన్‌గా తెరకెక్కిన ఆ సినిమా ప్రచారంలో భాగంగా సాహు గారపాటి రీసెంట్‌గా మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగానే చిరంజీవి సినిమా గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ‘చిరంజీవి – అనిల్‌ రావిపూడి సినిమా కమర్షియల్‌ చిత్రం లాగే ఉంటుంది. అనిల్‌ – చిరంజీవి మార్కు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పారు. అలాగే సినిమాలో చిరంజీవి పాత్ర కొత్తగా ఉంటుందని, అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌ అందులో ఉంటాయని సాహు గారపటి (Sahu Garapati) చెప్పారు. ఈ ఏడాది మే ఆఖరు లేదా జూన్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభవుతుందని చెప్పారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నామని ఆయన చెప్పారు. దీంతో అనిల్‌ రావిపూడి మరోసారి పొంగల్‌కి మ్యాజిక్‌ చేస్తారని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’(Vishwambhara)  సినిమా పనుల్ని రీస్టార్ట్‌ చేశారు. త్వరలో సినిమా పూర్తి చేసి, సంతృప్తికరంగా అనిపిస్తే అప్పుడు రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. టీజర్‌కి వచ్చిన నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వల్లే ఆలోచనలో ఈ మార్పులు వచ్చాయని టీమ్‌ వర్గాల సమాచారం.

‘తండేల్‌’పై దర్శకేంద్రుడి రివ్యూ.. ఏం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus