పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి విజయాలతో దూసుకు పోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి వరుసగా తిక్క, విన్నర్, నక్షత్రం రూపంలో అపజయాలు పలకరించాయి. ప్రస్తుతం బీవీఎస్ రవి దర్శకత్వంలో నటించిన జవాన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయినా ఈ మూవీ ట్రైలర్ అత్యధిక వ్యూస్ అందుకొని జవాన్ టీమ్ ని సంతోషపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికపై అభిమానులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘గ్యాంగ్‌లీడర్’కి సీక్వెల్ చేయమని సాయి ధరమ్ తేజ్‌ని ఓ అభిమాని కోరగా .. అందుకు సాయి ‘‘అది చేయాల్సింది నేను కాదు. చరణ్. ‘గ్యాంగ్‌లీడర్’ చేస్తే చరణే చేయాలి..’’ అంటూ సమాధానం చెప్పారు.
ఇది వరకు మెగాస్టార్ పాటలు వాడుకుంటూ హిట్స్ కొట్టేస్తున్నారని గతంలో సాయి ధరమ్ తేజ్ పై విమర్శలు వచ్చాయి. అప్పుడే ఇకనుంచి మామయ్య చిరంజీవి పాటలు వాడుకోనని స్పష్టం చేసిన సాయి ధరమ్ తేజ్.. తాజాగా చిరు సినిమాల రీమేక్ హక్కులు కూడా చరణ్ కే ఉన్నాయని ప్రకటించి మెగా అభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. సాయి ఎన్నో అసలు పెట్టుకున్న ‘జవాన్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 1న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇదైనా అతన్ని హిట్ ట్రాక్ లోకి తీసుకుపోతుందేమో చూడాలి.