Sai Pallavi: మనస్సు ప్రశాంతంగా ఉంది: సాయిపల్లవి

నేచురల్ బ్యూటీ, సహజనటి సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన చిత్రాలతో, వ్యక్తిత్వంతో తెలుగు వారి మద్దతు పుష్కలంగా సంపాదించుకుంది. అలాగే ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేసుకుంది. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకులకు మాత్రం చాలా దగ్గరైంది. ప్రతి సినిమాలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తమిళం, మలయాళంలో నటిగా గుర్తింపు సాధించి.. తెలుగులోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ‘ఫిదా’తో ఎంట్రీ ఇచ్చింది.

తొలిసినిమాతోనే సాయిపల్లవి (Sai Pallavi) మంచి ఫేమ్ దక్కించుకున్నారు. నేచురల్ యాక్టింగ్, తనదైన శైలితో మెప్పించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో మెరుస్తూ వచ్చింది. విభిన్న పాత్రలు పోషిస్తూ అలరించింది. అటు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూనే ఉంది. ఇక సాయి పల్లవి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగినదనే విషయం తెలిసిందే. ఎలాంటి విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడుతుంటుంది. తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది. అందుకే ఆమెపై నటిగానూ, వ్యక్తిత్వం పరంగానూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తుంటారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల సాయిపల్లవి ఎక్కువగా నేచర్ కు దగ్గరగా ఉంటున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ న్యూ ఎనర్జీని పొందుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా తన వెకేషన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది.

లేటెస్ట్ పిక్స్ లో సాయి పల్లవి బ్యూటీఫుల్ లోకేషన్ లో స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించింది. చుట్టూ పచ్చదనం, యానిమల్స్, ఎత్తైన చెట్లు మధ్య ఆహాల్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది. సింపుల్ లుక్ లో దర్శనమిచ్చి ఆకట్టుకుంది. ఈ పిక్స్ షేర్ చేస్తూ… ‘మనస్సు ప్రశాంతంగా ఉంది’ అంటూ క్యాప్షన్ లో పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి శివ కార్తీకేయ సరసన ఎస్ కే 21లో నటిస్తోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus