సాయి పల్లవి కొత్త ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన.. ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. మొదటి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక రెండో చిత్రం ‘ఎం.సి.ఏ’ కూడా సూపర్ హిట్ అవడంతో.. ఈమె క్రేజ్ డబుల్ అయ్యిందనే చెప్పాలి. అయితే తరువాత ఈమె నటించిన ‘కణం’ ‘పడి పడి లేచె మనసు’ చిత్రాలు ప్లాప్ అయ్యాయి. అయినా ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.

అయినా సరే.. ఈమె మాత్రం కథా ప్రాధాన్యత ఉండే సినిమాలనే ఎంచుకుంటుంది. ప్రస్తుతం రానాతో ‘విరాటపర్వం’ , నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సాయి పల్లవి కూడా ఓ విషయంలో సమంతనే ఫాలో అవుతుందట. సమంత కూడా ‘ఫ్యామిలీ మెన్2’ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సాయి పల్లవి కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

వివరాల్లోకి వెళితే.. స్టార్ డైరెక్టర్ మణిరత్నం నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో సాయి పల్లవి నటించబోతుందట. ‘నవరస’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 9 ఎపిసోడ్ లు ఉంటాయట.ఒక్కో ఎపిసోడ్ ను ఒక్కో డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడట. ఒక ఎపిసోడ్ ను ‘అసురన్’ ఫేమ్ వెట్రిమారన్ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక సాయి పల్లవి ఈ వెబ్ సిరీస్ లో ప్రకాష్ రాజ్ కు కూతురిగా నటించబోతుందని సమాచారం.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus