Sai Pallavi: నాలుగేళ్లు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది!

సినిమా ఇండస్ట్రీలో నాచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సినిమాల ఎంపిక విషయంలో సాయి పల్లవి తీరు ప్రత్యేకమని చెప్పాలి. గ్లామర్ షో కి తావు లేకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటారు. ఇకపోతే నేడు (మే 9)సాయి పల్లవి పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాయి పల్లవి (Sai Pallavi) కోయంబత్తూర్ లో జన్మించారు. తన తండ్రి కస్టమ్స్ ఆఫీసర్ కాగా తల్లి మంచి డాన్సర్ కావడంతో సాయి పల్లవి కూడా డాన్స్ లో ఎంతో ఇష్టత చూపించారు. ఇలా స్కూల్ చదివే సమయంలోనే డాన్స్ పై మక్కువతో ఉన్నటువంటి సాయి పల్లవి అనంతరం సినిమాలపై కూడా ఆసక్తిని పెంచుకుంది. తొలుత ‘ధామ్ ధూమ్’ తమిళ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత డాన్స్ పై ఫోకస్ పెట్టి రాణించింది.

అనంతరం పలు డాన్స్ షోలలో పాల్గొంటూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. దాంతో హీరోయిన్ గానూ అవకాశాలు అందాయి. కానీ తల్లిదండ్రులు నో చెప్పడం వెనక్కి తగ్గింది. ఆ సమయంలో ఈమె జార్జియా వెళ్ళిపోయింది. ఇలా జార్జియా వెళ్లిన సాయి పల్లవి 4 సంవత్సరాల పాటు అక్కడే ఉంటూ మెడిసిన్ చదువుకుంటూ నాలుగేళ్లు అక్కడే స్థిరపడ్డారు. ఇలా మెడిసిన్ కారణంగా నాలుగు సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

మెడిసిన్ పూర్తి అయిన తర్వాత ఈమెకు తిరిగి సినిమా అవకాశాలు రావడంతో ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక ఈమె హీరోయిన్ గా వరుస సినిమాలలో రాణిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే ఈమె మొహంపై పింపుల్స్ ఎక్కువగా ఉండటం వల్ల తనని హీరోయిన్గా స్వాగతిస్తారా లేదా అన్న భయం తనలో ఎక్కువగా ఉండేదని, ఈ సినిమా హిట్ అయిన తర్వాత తనకు మరింత కాన్ఫిడెంట్ పెరిగిందని సాయి పల్లవి పలు సందర్భాలలో వెల్లడించారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus