Sai Pallavi: అలాంటి సాంగ్స్ కు సాయిపల్లవి దూరమట.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి కంఫర్ట్ కు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. కంఫర్ట్ లేని రోల్స్ లో నటించడానికి ఆమె అస్సలు అసక్తి చూపరు. అయితే ఛాన్స్ వస్తే స్పెషల్ సాంగ్స్ లో నటిస్తారా అనే ప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్నకు సాయిపల్లవి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సాయిపల్లవి ఇచ్చిన ఆ సమాధానం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. స్పెషల్ సాంగ్స్ విషయంలో నేను అంత కంఫర్టబుల్ గా ఉండనని ఆమె తెలిపారు.

అందువల్ల ఆ సాంగ్స్ నేను చేయలేనని సాయిపల్లవి అభిప్రాయం వ్యక్తం చేశారు. సాయిపల్లవి కంఫర్ట్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మూవీ ఆఫర్లు తగ్గినా అభిమానించే అభిమానులను మాత్రం అంతకంతకూ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం తండేల్ సినిమాలో సాయిపల్లవి మరో పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా సాయిపల్లవి రేంజ్ ను మరింత పెంచడంతో పాటు ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఊహించని స్థాయిలో పెంచే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సాయిపల్లవి పారితోషికం సైతం పరిమితంగానే ఉంది. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోని పక్షంలో మిగతా రెమ్యునరేషన్ ను తీసుకోవడానికి కూడా సాయిపల్లవి ప్రాధాన్యత చూపరని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయిపల్లవి ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయిపల్లవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో తన రేంజ్ ను మరింత పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది.

యంగ్ జనరేషన్ స్టార్స్ సాయిపల్లవికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెండు కోట్ల రూపాయలకు అటూఇటుగా సాయిపల్లవి (Sai Pallavi) పారితోషికం ఉంది. కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus