Sai Pallavi: ‘రామాయణ’ టీమ్‌.. ఫాస్ట్‌ ఫాస్ట్‌గా పని పూర్తి చేస్తున్నారుగా?

భారతీయ సినిమాలో అతి పెద్ద సినిమాగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌ ‘రామాయణ’. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి పార్టుకు సంబంధించి చిత్రీకరణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఓవైపు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. ఈ లోపు రెండో పార్టుకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టేశారని సమాచారం. మామూలుగా అయితే మొదటి పార్టు సినిమా విడుదలయ్యాక ఆ ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని రెండో పార్టు పనులు మొదలుపెడతారు. కానీ ఇక్కడ చూస్తే ఇంకా తొలి పార్టు పూర్తవ్వకుండానే రెండో పార్టు పనులు మొదలుపెట్టేశారు అని సమాచారం.

Sai Pallavi

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి (Sai Pallavi)  సీతగా నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. నితీశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాల్లో రావణుడిగా యశ్‌ (Yash) నటిస్తున్నాడు. అలాగే సినిమాకు ఓ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. రెండో భాగానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదే మే నెలాఖరు నుండి ‘రామాయణ 2’ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టనున్నారట. ఈ షెడ్యూల్‌లో సీత పాత్రకు సంబంధించి అశోక వనం ఎపిసోడ్స్‌ చిత్రీకరించనున్నారని సమాచారం.

ఇక జూన్‌ నుంచి రణ్‌బీర్‌ కపూర్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో రణ్‌బీర్‌ – సాయిపల్లవి మీద రెండు పాటలు కూడా చిత్రీకరిస్తారు అని అంటున్నారు. ఆ తర్వాత యశ్‌ పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తారు అనే టాక్‌ కూడా వస్తోంది. ఇక సినిమాల విడుదల గురించి చూస్తే.. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుంది. రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేయాలని చూస్తున్నారట.

అంటే రెండు సినిమాలకు సంబంధించి మెయిన్‌ సీన్స్‌ షూటింగ్‌ తొలి పార్టు రిలీజ్‌కు ముందే పూర్తి చేయాలని చూస్తున్నారు. మరోవైపు రణ్‌బీర్‌, సాయిపల్లవి, యశ్‌.. ఇతర సినిమాలకు ఇబ్బంది లేకుండా ప్రధాన సన్నివేశాలు పూర్తి చేసే ఆలోచన వల్లే సినిమా షూటింగ్‌ ఫాస్ట్‌ ఫాస్ట్‌గా పూర్తి చేసే ఆలోచనలో భాగంగా సినిమా షూటింగ్‌ ప్లాన్‌ చేసుకున్నారని టాక్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus